Telugu Global
Cinema & Entertainment

Project K: ప్రభాస్ సినిమా రికార్డుల వేట మొదలు

Project K: ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ప్రాజెక్ట్-కె. ఇది రిలీజ్ అవ్వడానికి చాలా టైమ్ ఉంది. అంతలోనే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది.

Project K: ప్రభాస్ సినిమా రికార్డుల వేట మొదలు
X

ప్రభాస్ సినిమా రికార్డుల వేట మొదలుపెట్టింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా ప్రాజెక్ట్-కె. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ప్రీ-రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా నైజాం బిజినెస్ కళ్లుచెదిరే స్థాయిలో జరిగింది.

ఈ సినిమా నైజాం రైట్స్ ఏకంగా 70 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఏషియన్ సునీల్ ఈ మేరకు డీల్ క్లోజ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. నైజాం ఏరియాకు సంబంధించి ఇదో రికార్డ్. ఇప్పటివరకు నైజాంలో ఏ సినిమా ఈ రేటుకు అమ్ముడుపోలేదు.

టాలీవుడ్ కు చెందిన కొంతమంది నిర్మాతలు, సునీల్ నారంగ్, సురేష్ బాబుతో కలిసి డిస్ట్రిబ్యూషన్ సిండికేట్ గా ఏర్పడ్డారు. ఈమధ్య వచ్చిన సీతారామం, కార్తికేయ-2, తాజాగా రిలీజైన ధమాకా సినిమాల్ని ఇలానే సిండికేట్ మీద రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే సిండికేట్, ప్రాజెక్టు-కె నైజాం రైట్స్ ను దక్కించుకుంది.

ప్రభాస్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది ప్రాజెక్ట్-కె. దీపిక పదుకోన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. 2024లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

First Published:  3 Jan 2023 8:30 AM GMT
Next Story