Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్‌–మారుతిల చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌

Prabhas's Raja Saab Telugu Movie: ఈ చిత్రానికి ‘రాజా సాబ్‌’ టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. ఫస్ట్‌ లుక్‌లో ప్రభాస్‌ లుంగీ కట్టి ఉన్న దృశ్యం విశేషంగా ఆకట్టుకుంటోంది.

ప్రభాస్‌–మారుతిల చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌
X

ప్రభాస్‌ అభిమానులకు దర్శకుడు మారుతి సంక్రాంతి కానుకగా సర్‌ప్రైజ్‌ అందించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం టైటిల్‌ని పండుగ సందర్భంగా ప్రకటించారు. దీనితో పాటు ఫస్ట్‌లుక్‌ కూడా విడుదల చేశారు. పండుగ వేళ ప్రభాస్‌ సినిమాకు అదిరిపోయే టైటిల్‌ ఫిక్స్‌ చేయడం.. దీంతో పాటు విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ కూడా విశేషంగా ఆకట్టుకునేలా ఉండటం ఆయన అభిమానులను హుషారెత్తిస్తోంది.

ఇక ఈ చిత్రానికి ‘రాజా సాబ్‌’ టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. ఫస్ట్‌ లుక్‌లో ప్రభాస్‌ లుంగీ కట్టి ఉన్న దృశ్యం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా షూటింగ్‌ను గతేడాది ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు అధికారిక సమాచారం ఏదీ పెద్దగా బయటకు రాలేదు. హీరోయిన్ల విషయం కూడా అధికారికంగా వెల్లడించలేదు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌ నటిస్తున్నారనేది సోషల్‌ మీడియాలో వస్తున్న సమాచారం మాత్రమే.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ’సలార్‌’ విజయోత్సాహంలో ఉన్న ప్రభాస్‌ ఈ కొత్త సినిమాతోపాటు ’కల్కి 2898 ఏడీ’ లోనూ నటిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 9న విడుదల కానుంది.


First Published:  15 Jan 2024 3:50 AM GMT
Next Story