Telugu Global
Cinema & Entertainment

Kalki | ప్రభాస్ కల్కి మూవీ అప్ డేట్స్

Prabhas's Kalki Movie: కల్కి మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. మరో 3 నెలల్లో ట్రయిలర్ కూడా రాబోతోంది.

Kalki | ప్రభాస్ కల్కి మూవీ అప్ డేట్స్
X

ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ కాంబినేషన్ లో రూపొందుతున్న మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘కల్కి 2898 AD’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ కి మంచి స్పందన వచ్చింది.

తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఐఐటీ బాంబేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ జరిగిన 'టెక్ ఫెస్ట్-23'లో కల్కి ప్రత్యేక కంటెంట్ ను ప్రదర్శించారు.

"కల్కి చాలా డిఫరెంట్ ఫిల్మ్. ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ. హాలీవుడ్ ఫ్యుచరిస్ట్ సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్ లో ఎలా ఉంటాయో చూశాం. 'కల్కి'లో ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉండబోతున్నాయో ప్రేక్షకులు చూస్తారు. కల్కి కోసం దాదాపు ఐదేళ్ళుగా శ్రమిస్తున్నాం. ప్రతి అంశంపై లోతుగా అలోచించి, స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాం."

ఇలా కల్కి సినిమాపై స్పందించాడు నాగ్ అశ్విన్. కల్కి టైటిల్ పెట్టడం వెనక చాలా పెద్ద రీజన్ ఉందని, సినిమా చూసిన తర్వాత ఆ విషయం అర్థమౌతుందని చెప్పిన నాగ్ అశ్విన్.. త్వరలోనే కల్కి రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తామని, మరో 93 రోజుల్లో ట్రయిలర్ వస్తుందని ప్రకటించాడు.

First Published:  30 Dec 2023 3:39 PM GMT
Next Story