Telugu Global
Cinema & Entertainment

Kalki | ప్రభాస్ సినిమా వాయిదా తప్పదా?

Prabhas's Kalki Movie - ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా మరోసారి వాయిదా పడనుందా..? ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ పై చాలా పుకార్లు వినిపిస్తున్నాయి.

Kalki | ప్రభాస్ సినిమా వాయిదా తప్పదా?
X

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో మే 9న సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో షూటింగ్ చేస్తున్నారు.

వాళ్లు ఆ టార్గెట్ ను అందుకుంటారు కూడా. ఎందుకంటే, సినిమా షూట్ దాదాపు పూర్తయింది. ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలి ఉంది. ఈ నెలాఖరకు అది కూడా పూర్తవుతుంది. ఇక అంతా సెట్ అనుకున్న టైమ్ లో సినిమా విడుదలను వాయిదా వేయక తప్పని పరిస్థితి. ఎందుకంటే, ఎన్నికల ప్రకటన వచ్చేసింది.

సరిగ్గా కల్కి రిలీజ్ టైమ్ కు దేశంలో ఎన్నికలు పీక్ స్టేజ్ కు చేరుకుంటాయి. దేశమంతా ఎలక్షన్ ఫీవర్ లో ఉన్న టైమ్ లో కల్కి సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

కల్కి సినిమాకు వాయిదా కొత్తకాదు, ఆల్రెడీ ఓసారి వాయిదా పడింది. ఈసారి మాత్రం వాయిదా వేస్తున్నందుకు నిర్మాత అశ్వనీదత్ చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే, మే 9 అనేది ఆయనకు సెంటిమెంట్ తేదీ. అదే తేదీకి ఆయన జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి లాంటి సినిమాల్ని రిలీజ్ చేసి హిట్ కొట్టారు. కాబట్టి కల్కిని కూడా అదే తేదీకి విడుదల చేయాలనుకున్నారు. కానీ ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఇప్పుడీ సీనియర్ నిర్మాత ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.




First Published:  17 March 2024 8:37 AM GMT
Next Story