Telugu Global
Cinema & Entertainment

Adipurush - ఆదిపురుష్ మొదటి వారాంతం వసూళ్లు

Prabhas Adipurush - ఆదిపురుష్ సినిమా నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది. ఈ 3 రోజుల్లో సినిమాకు కళ్లుచెదిరే వసూళ్లు వచ్చాయి.

Adipurush - ఆదిపురుష్ మొదటి వారాంతం వసూళ్లు
X

ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓవైపు ఈ మూవీపై ట్రోలింగ్ నడుస్తోంది. విపరీతంగా వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే మరోవైపు మాత్రం ఈ సినిమాను జనాలు చూస్తూనే ఉన్నారు. భారీ స్థాయిలో వసూళ్లు వస్తూనే ఉన్నాయి. నిన్నటితో మొదటి వారాంతం పూర్తి చేసుకున్న ఈ సినిమా 3 రోజుల్లోనే 300 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది.

అవును.. ఆదిపురుష్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 340 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకు 140 కోట్లు, రెండో రోజు ఈ సినిమాకు 100 కోట్లు, మూడో రోజు మరో 100 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అలా 3 రోజుల్లో ఈ సినిమాకు 340 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

కేవలం ప్రభాస్ కు ఉన్న పాపులారిటీ కారణంగా ఆదిపురుష్ కు ఈ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. అంతేతప్ప, సినిమాలో ఏమాత్రం విషయం లేదు. రామాయణంలో కేవలం యుద్ధకాండను బేస్ చేసుకొని తీసిన ఈ సినిమాలో ఎలాంటి ఎమోషన్ లేదు. భక్తి అంతకంటే లేదు.

అటు నార్త్ లో కూడా ప్రభాస్ ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన 3 రోజుల్లోనే ఈ సినిమాకు బాలీవుడ్ లో 134 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. బాలీవుడ్ లో గమ్మత్తైన విషయం ఏంటంటే.. రోజురోజుకు ఈ సినిమాకు వసూళ్లు పెరుగుతున్నాయి. శుక్రవారం కంటే శనివారం, శనివారం కంటే ఆదివారం.. ఆదిపురుష్ హిందీ వెర్షన్ కు వసూళ్లు పెరగడం విశేషం.

First Published:  19 Jun 2023 2:36 PM GMT
Next Story