Telugu Global
Cinema & Entertainment

Adipurush - ఆదిపురుష్ 10 రోజుల వసూళ్లు

Adipurush collection - ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా 10 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు వచ్చిన తాజా వసూళ్లు చూద్దాం.

Adipurush - ఆదిపురుష్ 10 రోజుల వసూళ్లు
X

ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓవైపు నెగెటివ్ టాక్ నడుస్తున్నప్పటికీ, సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా 10 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఈ 10 రోజుల్లో సినిమాకు వరల్డ్ వైడ్ 450 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.

ట్రేడ్ ప్రకారం, ఆదిపురుష్ మూవీ త్వరలోనే భారతదేశంలో రూ. 300 కోట్ల మార్క్ ను చేరుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు టికెట్ రేట్లు తగ్గించారు. రూ.112 టికెట్ ధరతో, త్రీడీలో ఈ సినిమాను చూసే వెసులుబాటు కల్పించారు. దీంతో సినిమాకు మరిన్ని వసూళ్లు పెరగొచ్చని యూనిట్ ఆశిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పడిపోయి చాలా రోజులైంది. వీకెండ్ కారణంగా శని, ఆదివారాల్లో ఈ సినిమాకు ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చాయి. ఏపీ,నైజాంలో ఆదిపురుష్ సినిమాకు ఈ 10 రోజుల్లో వచ్చిన షేర్లు (కోట్ల రూపాయల్లో) ఇలా ఉన్నాయి

నైజాం : 38.01

సీడెడ్ : 11.76

ఉత్తరాంధ్ర : 10.26

ఈస్ట్ : 5.95

వెస్ట్ : 4.88

గుంటూరు : 6.68

కృష్ణా : 4.61

నెల్లూరు : 2.51

10 రోజుల మొత్తం షేర్ :- రూ 84.66 కోట్లు

First Published:  26 Jun 2023 12:47 PM GMT
Next Story