Telugu Global
Cinema & Entertainment

Prabhas's Salaar Movie: మరో నెల రోజుల్లో సలార్ పూర్తి

Prabhas's Salaar Movie: సలార్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీని త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నాడు.

Prabhass Salaar Movie: మరో నెల రోజుల్లో సలార్ పూర్తి
X

Prabhas's Salaar Movie: మరో నెల రోజుల్లో సలార్ పూర్తి

ఒకేసారి 2-3 సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. తన అవసరం ఉండి, తనపై షూటింగ్ ఉన్న సినిమాలకు మాత్రమే కాల్షీట్లు ఇస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. ఇదే పద్ధతిపై మొదట "ఆదిపురుష్" షూటింగ్‌ను పూర్తిచేశాడు. ఇప్పుడు తన దృష్టి మొత్తాన్ని సలార్ పై పెట్టాడు.

తాజా సమాచారం ప్రకారం, మరో నెల రోజుల్లో సలార్ షూటింగ్ పూర్తిచేయాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడు. మార్చి నెల మొత్తం ఇదే సినిమాపై ఉంటూ, ఏప్రిల్ నాటికి "సాలార్" ప్రాజెక్ట్ మొత్తాన్ని పూర్తి చేయాలనేది ప్రభాస్ ప్లాన్.

ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తయింది. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ధృవీకరించాడు.

ఇక మిగిలిన పనులన్నీ వచ్చే 30-40 రోజుల్లో పూర్తి చేయాలని యూనిట్ భావిస్తోంది. అందులో మేజర్ వర్క్ ప్రభాస్ కు సంబంధినదే ఉంది. ఈ షూట్ తర్వాత, పూర్తిగా 2 నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పై దృష్టి పెడతాడు ప్రశాంత్ నీల్. సెప్టెంబర్ లో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

First Published:  24 Feb 2023 10:12 AM GMT
Next Story