Telugu Global
Cinema & Entertainment

Prabhas Spirit: డిసెంబర్ నుంచి ప్రభాస్ కొత్త సినిమా

Prabhas Spirit Movie Latest Update: త్వరలోనే మరో సినిమాకు రెడీ అవ్వబోతున్నాడు ప్రభాస్. అతడి ఖాతాలో స్పిరిట్ అనే మూవీ ఉన్న సంగతి తెలిసిందే.

Prabhas Spirit: డిసెంబర్ నుంచి ప్రభాస్ కొత్త సినిమా
X

ఇకపై ఏడాదికి కనీసం 2 సినిమాలు చేస్తానని ప్రభాస్, అభిమానులకు మాటిచ్చాడు. ఒక్కోసారి మూడు కూడా రావొచ్చని హింట్ ఇచ్చాడు. నిజానికి ప్రభాస్ ఇప్పటికే కొత్త ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ఈ సంవత్సరం, అతను "ఆదిపురుష్", "సలార్" సినిమాల్ని విడుదలకు షెడ్యూల్ చేశాడు.

వచ్చే ఏడాది, అతను "ప్రాజెక్ట్ కె" సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమాను కూడా 2024లోనే రిలీజ్ చేస్తాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ లోపు పూర్తవుతుంది.

ఆ తర్వాత ప్రభాస్ మరో ప్రాజెక్ట్‌కి షిఫ్ట్ అవుతాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో "స్పిరిట్" అనే సినిమాను స్టార్ట్ చేస్తాడు ప్రభాస్. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే "స్పిరిట్" కోసం కథను డెవలప్ చేసి పెట్టాడు.

ప్రస్తుతం ఈ దర్శకుడు, యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ కంప్లీట్ అయిన వెంటనే స్పిరిట్ సినిమా స్క్రీన్ ప్లే పై వర్క్ చేస్తాడు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి స్పిరిట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాడు ప్రభాస్. అలా 2025కి కూడా రెండు సినిమాలు రెడీ చేసే పనిలో పడ్డాడు.

First Published:  8 Jun 2023 11:54 AM GMT
Next Story