Telugu Global
Cinema & Entertainment

Salaar | డిసెంబర్ నుంచి ప్రభాస్ ప్రమోషన్

Prabhas - ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్. ఈ సినిమా ప్రచారాన్ని డిసెంబర్ 1 నుంచి ప్రారంభించబోతున్నాడు ఈ హీరో.

Salaar | డిసెంబర్ నుంచి ప్రభాస్ ప్రమోషన్
X

మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన ప్రభాస్, ఎట్టకేలకు ఇంటికి తిరిగొచ్చాడు. దాదాపు 3 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్, ఇండియాలో ల్యాండ్ అయ్యాడు. దీంతో అతడి సినిమాల్లో మరోసారి కదలిక వచ్చింది.

ప్రభాస్ ఇండియాకు ఇలా రావడమే ఆలస్యం, అలా అతడి కొత్త సినిమా నుంచి క్లారిటీ వచ్చింది. సలార్ సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. దీనిపై యూనిట్ క్లారిటీ ఇచ్చింది. తమ సినిమా డిసెంబర్ 22కు వచ్చి తీరుతుందని తెలిపింది.

ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ప్రచారంలోకి దిగబోతున్నాడు ప్రభాస్. ఓ 10 రోజుల పాటు రెస్ట్ తీసుకొని, ఆ తర్వాత సలార్ ట్రయిలర్ లాంచ్ లో పాల్గొంటాడు. ఆ వెంటనే సినిమాకు సంబంధించి ఓ కామన్ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ 1 నుంచి ప్రభాస్ రంగంలోకి దిగబోతున్నాడు.

ఇక ప్రభాస్ ఇతర సినిమాల విషయానికొస్తే.. సలార్ రిలీజైన వెంటనే పూర్తిస్థాయిలో కల్కి సినిమాకు టైమ్ కేటాయించబోతున్నాడు ప్రభాస్. రెండు భాగాలుగా రాబోతున్న ఆ సినిమాను ఒకేసారి పూర్తిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో సినిమాను పూర్తి చేస్తాడు.

First Published:  9 Nov 2023 4:12 PM GMT
Next Story