Telugu Global
Cinema & Entertainment

Prabhas: 2 భాగాలుగా ప్రభాస్ ఇంటర్వ్యూ

Prabhas: బాలకృష్ణ హోస్ట్ గా ప్రభాస్ గెస్ట్ గా అన్ స్టాపబుల్ కార్యక్రమం జరిగింది. ఇప్పుడీ షోను 2 భాగాలుగా స్ట్రీమింగ్ చేయాలని 'ఆహా' నిర్ణయించింది.

Prabhas: 2 భాగాలుగా ప్రభాస్ ఇంటర్వ్యూ
X

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ ఆహాలో కనిపించబోతున్నాడు. నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తోన్న‌ అన్‌స్టాప‌బుల్‌లో ప్రభాస్ పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో కూడా విడుద‌లైంది. దీంతో ప్ర‌భాస్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు.

ఇటు బాల‌కృష్ణ, అటు ప్ర‌భాస్‌, గోపీచంద్‌ల ఫ్యాన్స్ ప‌ర్‌ఫెక్ట్ విందు భోజ‌నంలాంటి ఎపిసోడ్‌ను ఆహా సిద్ధం చేసింది. ఇంత గొప్ప ఎపిసోడ్‌ ను ఎడిట్ చేయ‌టానికి చాలా క‌ష్ట‌ప‌డుతోంది యూనిట్. ఎందుకంటే ఇందులో ప్ర‌తి క్ష‌ణం ఎంతో విలువైన‌దే. దాన్ని ప్ర‌తీ ఒక్క‌రూ ఆస్వాదించాలి. దీంతో ఆహా.. ఈ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని నిర్ణ‌యించుకుంది.

అవును.. 100 నిమిషాల బాహుబలి ఎపిసోడ్‌ని రెండు భాగాలు చేశారు. ఒక భాగాన్ని డిసెంబ‌ర్ 30న కొత్త సంవత్సరాది ట్రీట్‌గా ప్ర‌సారం చేస్తారు. ఇక రెండో భాగాన్ని జ‌న‌వ‌రి 6న స్ట్రీమింగ్ చేస్తారు.

డిసెంబ‌ర్ 30న ప్ర‌సారం కాబోయే తొలి ఎపిసోడ్‌లో బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్ మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. ఇక డిసెంబ‌ర్ 6న ప్ర‌సారం కాబోయే రెండో ఎపిసోడ్‌లో ప్ర‌భాస్‌, ఆయ‌న బెస్ట్ ఫ్రెండ్ హీరో గోపీచంద్, బాల‌కృష్ణ మ‌ధ్య సంభాషణను చూపిస్తారు.

First Published:  29 Dec 2022 3:24 AM GMT
Next Story