Telugu Global
Cinema & Entertainment

Salaar | ప్రభాస్ ముందు భారీ లక్ష్యం

Salaar - మరికొన్ని రోజుల్లో సలార్ రిలీజ్ అవుతోంది. ప్రభాస్ ముందు భారీ లక్ష్యాలున్నాయి.

Salaar | ప్రభాస్ ముందు భారీ లక్ష్యం
X

యానిమల్, జవాన్, లియో సినిమాల రాకతో సలార్ ముందు భారీ టార్గెట్ ఫిక్స్ అయింది. మరీ ముఖ్యంగా మొదటి రోజు వసూళ్లలో సలార్ సినిమా సత్తా చాటాల్సి ఉంది. ఇంతకీ సలార్ ముందున్న భారీ లక్ష్యం ఏంటో చూద్దాం..

లియో సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. జవాన్ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 129.6 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇక యానిమల్ సినిమా విషయానికొస్తే, ఫస్ట్ డే ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 116 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. వీటిలో ఏ సినిమాను సలార్ అధిగమిస్తుందో చూడాలి.

ట్రేడ్ అంచనా ప్రకారం, సలార్ సినిమాకు మొదటి రోజు 140 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. అదే కనుక నిజమైతే, ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనర్ గా సలార్ సినిమా నిలుస్తుంది. ఇక సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే, లాంగ్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.

First Published:  18 Dec 2023 3:37 PM GMT
Next Story