Telugu Global
Cinema & Entertainment

Prabhas-Maruthi: మరోసారి తెరపైకి ప్రభాస్-మారుతి మూవీ

Prabhas-Maruthi Movie: ప్రభాస్-మారుతి సినిమా మళ్లీ తెరపైకొచ్చింది. ఈ నెలలో ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలుకాబోతోంది.

Prabhas-Maruthi: మరోసారి తెరపైకి ప్రభాస్-మారుతి మూవీ
X

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి చడీచప్పుడు లేకుండా ఓపెనింగ్ కానిచ్చేశారు. అంతే సీక్రెట్ గా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు.

ఫస్ట్ షెడ్యూల్ లో ప్రభాస్ పై ఫొటోషూట్, టెస్ట్ కట్ చేశారు. ఆ తర్వాత కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ కు రెడీ అవుతోంది యూనిట్.

ఈ నెల రెండో వారంలో ప్రభాస్-మారుతి మూవీ రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. దీని కోసం హైదరాబాద్ శివార్లలో ఓ పాత సినిమా థియేటర్ సెట్ వేస్తున్నారు. ఈ సెట్ లోనే ప్రభాస్ పై కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు.

ఈసారి ప్రభాస్ తో పాటు హీరోయిన్లు కూడా పాల్గొంటారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, రిద్దీ కపూర్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లపై కూడా రెండో షెడ్యూల్ లో టెస్ట్ కట్ నిర్వహించబోతున్నారు.

హారర్ కామెడీ జానర్ లో తెరకెక్కుతోంది ప్రభాస్-మారుతి మూవీ. పీపుల్ మీడియా బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. రాజా డీలక్స్ అనేది ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఆదిపురుష్ సినిమా రిలీజ్ వాయిదా పడ్డంతో, ప్రభాస్ కు ఇప్పుడు కావాల్సినంత టైమ్ దొరికింది. అందుకే మారుతి సినిమాకు వెంటనే కాల్షీట్లు కేటాయించాడు.

First Published:  2 Dec 2022 5:19 AM GMT
Next Story