Telugu Global
Cinema & Entertainment

Prabhas-Maruthi - ప్రభాస్-మారుతి మూవీ లేటెస్ట్ అప్ డేట్

Prabhas-Maruthi Movie - మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ టాకీ 20శాతం పూర్తయింది.

Prabhas-Maruthi - ప్రభాస్-మారుతి మూవీ లేటెస్ట్ అప్ డేట్
X

సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది ప్రభాస్-మారుతి సినిమా. కాస్త కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో అప్ డేట్ బయటకొచ్చింది. అది కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్ డేట్.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో అతడు ప్రభాస్ కు తాతగా కనిపించనున్నాడట. నిన్నటివరకు ప్రభాస్ తండ్రి పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నాడంటూ ప్రచారం జరిగింది. కానీ అది తండ్రి పాత్ర కాదని, తాత పాత్ర అని తెలుస్తోంది.

ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మూవీకి సంబంధించి ఇప్పటికే 20శాతం టాకీ పార్ట్ పూర్తయింది. కొత్త షెడ్యూల్ ను మార్చి రెండో వారం నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో సలార్ షూట్ లో పాల్గొంటున్నాడు ప్రభాస్.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతోంది ప్రభాస్-మారుతి సినిమా. షూటింగ్ మొత్తం పూర్తయ్యేంతవరకు ఎలాంటి ప్రచారం చేయకూడదని మేకర్స్ నిర్ణయించారు. ఎందుకంటే, ఆదిపురుష్-సలార్ సినిమాలకు అది ఇబ్బందిగా మారుతుంది కాబట్టి.

First Published:  28 Feb 2023 3:33 AM GMT
Next Story