Telugu Global
Cinema & Entertainment

Kalki | ప్రభాస్ మూవీ షూటింగ్ అప్ డేట్స్

Kalki Movie - ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం.

Kalki | ప్రభాస్ మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ కాంబినేష్ లో రూపొందుతున్న ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అద్భుతమైన సినిమా అనుభవాన్ని అందించబోతుంది.

తాజాగా చిత్ర యూనిట్ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళింది. ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా పటానీ పాటు యూనిట్ అంతా కలసి దిగిన ఫోటోని ఈ సందర్భంగా మేకర్స్ షేర్ చేశారు. ఇటలీలోని అద్భుతమైన లోకేషన్స్ లో పాటని చాలా గ్రాండియర్ చిత్రీకరించనున్నారు.

'కల్కి' గత సంవత్సరం శాన్ డియాగో కామిక్-కాన్‌లో సంచలనం సృష్టించింది. టీజర్ గ్లింప్స్ ప్రపంచవ్యాప్త ప్రశంసలను పొందింది.

వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కల్కి' లో మైథాలజీ అంశాలు కూడా ఉంటాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల కానుంది.

First Published:  6 March 2024 5:12 PM GMT
Next Story