Telugu Global
Cinema & Entertainment

Prabhas | ట్విట్టర్ ట్రెండింగ్ లో ఏకైక హీరో

Prabhas - ప్రభాస్ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. భారత్ లో ఎక్కువమంది వాడిన హ్యాష్ ట్యాగ్స్ లో ప్రభాస్ మాత్రమే టాప్ లో నిలిచాడు.

Prabhas | సంక్రాంతికి ప్రభాస్ నుంచి మరో బహుమతి
X

స్టార్ హీరోలు ఎందరున్నా తాను ప్రత్యేకమని ఎన్నో రికార్డులు, ఘనతల ద్వారా నిరూపించుకుంటున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. రేర్ కాంబినేషన్స్, రికార్డు స్థాయి బాక్సాఫీస్ నెంబర్స్, భారీ పాన్ వరల్డ్ మూవీ లైనప్స్...ఇలా ఏ అంశంలో చూసినా రేసులో ఆయనెప్పుడూ మిగతా స్టార్స్ అందుకోలేనంత ఎత్తులోనే ఉంటాడు.

అందుకే ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ ను దాటి పాన్ ఇండియా స్థాయికి చేరుకుని చాలా కాలమౌతోంది. ఈ క్రేజ్ తాజాగా ఎక్స్(ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియాలో లిస్టులోనూ కనిపించింది. ట్విట్టర్ టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియాలో లిస్టులో ఏకైక హీరోగా నిలిచాడు ప్రభాస్.

ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో టాప్-10 మోస్ట్ యూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్ లో ప్రభాస్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. ట్విట్టర్ ఇండియా ఈ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇది ప్రభాస్ స్టార్ డమ్ కు సోషల్ మీడియాలో కనిపించిన క్రేజ్ అనుకోవచ్చు. ప్రభాస్ సాధించిన తాజా ఘనతతో అతడి ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు.

ప్రస్తుతం ఈ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కల్కి 2898 ఎడి, రాజా సాబ్ వంటి బిగ్ మూవీస్ లో నటిస్తున్నాడు. త్వరలోనే స్పిరిట్ మూవీని కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

First Published:  13 March 2024 4:57 PM GMT
Next Story