Telugu Global
Cinema & Entertainment

Project K | ప్రాజెక్ట్-కె నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్

Project K - పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్-కె నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజైంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Project K | ప్రాజెక్ట్-కె నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్
X

సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ కె' కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులని మరోసారి ఆకట్టుకుంది వైజయంతీ మూవీస్. ఈ చిత్ర భారీ తారాగణంలో కమల్ హాసన్ చేరికతో సంచలనం సృష్టించింది. తర్వాత శాన్ డియాగో కామిక్-కాన్‌లో పాల్గొనే మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈమధ్య విడుదలైన దీపికా పదుకొణె ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అందరినీ సర్ప్రైజ్ చేసింది.

ప్రేక్షకులను కట్టిపడేసేలా వైజయంతీ మూవీస్ ఇప్పుడు ఈ చిత్రం నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్‌ ని విడుదల చేసింది. ఇది గొప్ప సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది. ప్రభాస్ లుక్ పవర్ ఫుల్ గా ఉంది. అతడు మరో గ్రహంలో, యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. ప్రభాస్ గెటప్, కాస్ట్యూమ్ బాగున్నాయి.

'ప్రాజెక్ట్ K' గ్లింప్స్ ను శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్‌లో సినిమా టైటిల్, టీజర్‌ను రివీల్ చేస్తారు. భారత కాలమాణం ప్రకారం, 21వ తేదీన ఇండియాలో ప్రాజెక్ట్-కె గ్లింప్స్ రిలీజ్ అవుతుంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న 'ప్రాజెక్ట్ K'లో ఇండస్ట్రీ లోని బిగ్గెస్ట్ స్టార్స్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.

First Published:  19 July 2023 2:48 PM GMT
Next Story