Telugu Global
Cinema & Entertainment

Prabhas: ఈ సంక్రాంతికి ఒకే ఒక రోజు శెలవు

Prabhas: బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ప్రభాస్, ఈ సంక్రాంతికి కూడా గ్యాప్ తీసుకోవడం లేదు. సలార్ సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు.

Prabhas
X

Prabhas: ఈ సంక్రాంతికి ఒకే ఒక రోజు శెలవు

సంక్రాంతి వచ్చిందంటే చాలు అందరూ హాలిడేస్ తీసుకుంటారు. కుటుంబంతో కలిసి గడపాలని అనుకుంటారు. దీనికి హీరోలు కూడా అతీతం కాదు. సంక్రాంతి టైమ్ లో షూటింగ్స్ పెట్టుకోరు. అయితే హీరో ప్రభాస్ మాత్రం ఈసారి సంక్రాంతికి శెలవులు తీసుకోవడం లేదు.

ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. తన చేతిలో ఉన్న సినిమాలకు టైమ్ కేటాయించడానికి అతడికి 24 గంటలు సరిపోవడం లేదు. అందుకే సంక్రాంతి శెలవులు తీసుకోవడం లేదు ప్రభాస్. కేవలం సంక్రాంతి రోజున మాత్రమే గ్యాప్ తీసుకుంటున్నాడు.

ఈనెల 8వ తేదీ నుంచి సలార్ సినిమాకు కాల్షీట్లు ఇచ్చాడు ఈ హీరో. ఇది చాలా పెద్ద షెడ్యూల్. దాదాపు నెలాఖరు వరకు జరుగుతుంది. ఈ షెడ్యూల్ మధ్యలో మళ్లీ సంక్రాంతి బ్రేక్ తీసుకుంటే కష్టమని ప్రభాస్ భావించాడు. అందుకే ఒక్క రోజు మాత్రమే గ్యాప్ తీసుకుంటున్నాడు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది సలార్. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో ఈ ఏడాది థియేటర్లలోకి తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

First Published:  5 Jan 2023 9:30 AM GMT
Next Story