Telugu Global
Cinema & Entertainment

Prabhas | సలార్ కోసం బయటకొచ్చిన ప్రభాస్

Prabhas - మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న ప్రభాస్ ఎట్టకేలకు బయటకొచ్చాడు. సలార్ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు.

Prabhas | సలార్ కోసం బయటకొచ్చిన ప్రభాస్
X

ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘సలార్ సీజ్ ఫైర్’. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రీసెంట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘సలార్ సీజ్ ఫైర్’ గురించి మాట్లాడాడు.

‘‘సలార్ చిత్రంలో పాత్రల మధ్య చక్కటి ఎమోషన్స్ ఉంటాయి. ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడనటువంటి పాత్రలో నన్ను చూస్తారు. నేను, ప్రశాంత్ నీల్ కలిసి పని చేయాలనుకున్నప్పుడు సినిమా ఎలా ఉంటే అదరినీ ఆకట్టుకుంటుందనే విషయాలపై కలిసి బాగా చర్చించాం. నా మైండ్‌లో ఉన్న ఆలోచనలను ఆయన ముందు పెట్టాను. నేను చెప్పిన ఆలోచనల్లో కొన్ని ప్రశాంత్‌కి నచ్చాయి. ప్రతి సెషన్ ముందు ఇద్దరం మాట్లాడుకునే వాళ్లం. తను నా పాత్రను ఎలా చూపించాలనుకుంటున్నారనే విషయాలను తను నాకు వివరించేవాడు. ఇద్దరం కలిసి వర్క షాప్స్ చేశాం. సరదాగా సినిమాను పూర్తి చేశాం."

ఇలా సలార్ వెనక జరిగిన కథను బయటపెట్టాడు ప్రభాస్. ప్రభాస్ సినీ ప్రయాణం ప్రారంభించి 21 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్లలో షూటింగ్ కోసం ఎప్పుడూ ఎదురుచూడలేదని, సలార్ కోసం మాత్రం అంతలా ఎదురుచూశానని, ప్రశాంత్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడని చెప్పుకొచ్చాడు ప్రభాస్.

First Published:  16 Dec 2023 3:15 PM GMT
Next Story