Telugu Global
Cinema & Entertainment

Dasara - నాని సినిమాపై ప్రభాస్ ప్రశంశలు

Prabhas Nani - నాని హీరోగా నటించిన దసరా సినిమా ప్రభాస్ కు తెగ నచ్చింది. తన ఇష్టాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టాడు.

Dasara - నాని సినిమాపై ప్రభాస్ ప్రశంశలు
X

దసరా సినిమాపై ఇప్పటికే మహేష్ బాబు ప్రశంసలు కురిపించాడు. సినిమా సూపర్ గా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ప్రభాస్ కూడా దసరా పై స్పందించాడు. తెలుగులో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలంటున్నాడు.

"ఇప్పుడే దసరా సినిమా చూశాను. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. నానికి కంగ్రాచ్యులేషన్స్. ఇలాంటి కథను ఎంచుకున్న అతడ్ని అభినందించాల్సిందే. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరోయిన్ కీర్తిసురేష్ తో పాటు యూిట్ అంతా చాలా బాగా చేసింది. అందరికీ నా శుభాకాంక్షలు. మనం ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలి." ఇలా సినిమా చూసి తన స్పందన తెలియజేశాడు ప్రభాస్.

ప్రస్తుతం ఈ హీరో స్పెయిన్ లో ఉన్నాడు. సలార్ సినిమాకు సంబంధించి అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఆ గ్యాప్ లోనే దసరా సినిమా చూశాడు. ఆ వెంటనే సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాడు.

నాని హీరోగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజైంది. సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. నాని, కీర్తిసురేష్ పెర్ఫార్మెన్సులకు ఫుల్ మార్కులు పడ్డాయి

First Published:  3 April 2023 2:29 PM GMT
Next Story