Telugu Global
Cinema & Entertainment

Prabhas dating Kriti Sanon: ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారా? వరుణ్ ధావన్ కామెంట్స్ వైరల్

Prabhas dating Kriti Sanon Telugu News: ప్రభాస్, కృతి సనన్ జంటగా ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారిద్దరూ దగ్గర అయ్యారని బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది.

Prabhas dating Kriti Sanon: ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారా? వరుణ్ ధావన్ కామెంట్స్ వైరల్
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్, కృతి సనన్ జంటగా ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారిద్దరూ దగ్గర అయ్యారని బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. ఆదిపురుష్ టీజర్ రిలీజ్ సమయంలో ప్రభాస్, కృతి సన్నిహితంగా మెలగడంతో ఈ ప్రచారం మరింత బలపడింది. కాగా, తాజాగా కృతి సనన్ భేదియా అని సినిమాలో నటించింది. ఇందులో భాగంగా ఈ చిత్ర హీరో వరుణ్ ధావన్‌తో కలిసి ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో కృతి మాట్లాడుతూ ప్రభాస్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అతడిని పెళ్లి చేసుకోవాలని ఉందని కామెంట్స్ చేసింది. కృతి పదేపదే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుండటంతో నిజంగానే ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారా.. అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ విషయంలో హీరో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

బాలీవుడ్‌లో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ షోకి వరుణ్, కృతి హాజరయ్యారు. ఈ సందర్భంగా కరణ్ అడిగిన ఓ ప్రశ్నకు వరుణ్ ధావన్ సమాధానం ఇస్తూ 'కృతి సనన్ పేరు నా లిస్టులో లేదు. ఆమె పేరు మరొకరి హృదయంలో ఉంది. అతడు ప్రస్తుతం ముంబైలో అయితే లేడు. హైదరాబాద్‌లో దీపిక పదుకునేతో కలసి షూటింగ్‌లో ఉన్నాడు.' అని కామెంట్స్ చేశాడు. వరుణ్ చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.

ప్రస్తుతం దీపిక ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కె అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దీంతో వరుణ్ ధావన్ ప్రభాస్ పేరు నేరుగా చెప్పకుండా అతడు కృతి ప్రేమలో ఉన్నాడని ఇన్ డైరెక్ట్‌గా హింట్ ఇచ్చాడని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం కృతి సనన్ తాను నటిస్తున్న సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రమే ప్రభాస్ పేరు వాడుకుంటోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్, కృతి విషయమై బాలీవుడ్‌లో జరుగుతున్న ప్రచారం నిజమో కాదో తెలియాలంటే ప్రభాస్ స్పందించాల్సి ఉంది.

First Published:  28 Nov 2022 9:40 AM GMT
Next Story