Telugu Global
Cinema & Entertainment

ఒకే ఒక జీవితం.. విడుదలకు ముందు మంచి టాక్

శర్వానంద్ హీరోగా నటించిన సినిమా ఒకే ఒక జీవితం. రేపు థియేటర్లలోకి రాబోతోంది ఈ మూవీ. సెలబ్రిటీ షో వేసిన తర్వాత ఈ సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది.

ఒకే ఒక జీవితం.. విడుదలకు ముందు మంచి టాక్
X

శర్వానంద్ కు సరైన సక్సెస్ లేదు. ఇంకా చెప్పాలంటే వరుసపెట్టి 5 ఫ్లాపులిచ్చాడు ఈ హీరో. దీంతో అతడి సినిమాలకు ప్రీ-రిలీజ్ బజ్ పూర్తిగా పడిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఊసే లేదు. ఇలాంటి టఫ్ టైమ్ లో వస్తోంది ఒకే ఒక జీవితం. శర్వానంద్ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఈ సినిమాకు క్రేజ్ తీసుకురావడం మేకర్స్ కు యమ కష్టంగా మారింది.

అయితే ఎవరి అదృష్టమో ఏమో కానీ, ఒకే ఒక జీవితం సినిమాకు ఊహించని విధంగా పాజిటివ్ బజ్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ ప్రీమియర్ వేశారు. సినీ ప్రముఖులతో పాటు, మరికొంతమంది ఈ సినిమాను చూశారు. ఆ ప్రీమియర్ తర్వాత సినిమా జెన్యూన్ టాక్ బయటకొచ్చింది.

సైన్స్ ఫిక్షన్, మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా డీసెంట్ గా ఉందంట. మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ కాకపోయినా, ఫ్యామిలీస్ తో కలిసి ఈ సినిమాను హ్యాపీగా చూడొచ్చనే టాక్ బయటకొచ్చింది. దీంతో సినిమాపై అందరి దృష్టి పడింది.

నిజంగా శర్వాకు ఇది ఊరటనిచ్చే అంశమే. ఇన్నాళ్లూ తన సినిమాలకు బజ్ తీసుకొచ్చేందుకు ఈ హీరో చాలా కష్టపడేవాడు. ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. కానీ ఆ సినిమాలకు రాని క్రేజ్, ఒకే ఒక్క ప్రీమియర్ తో ఒకే ఒక జీవితం సినిమాకు వచ్చింది. అందుకే ప్రస్తుతానికి శర్వా హ్యాపీగా ఉన్నాడు. బజ్ కు తగ్గట్టు సినిమా కూడా హిట్టయితే, శర్వా కంటే ఆనందించే వ్యక్తి మరొకరు ఉండరు.

First Published:  8 Sep 2022 2:59 AM GMT
Next Story