Telugu Global
Cinema & Entertainment

Ponniyin Selvan - టీవీల్లో కూడా అదే రెస్పాన్స్

Ponniyin Selvan - మణిరత్నం కలల ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా పార్ట్-1 తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్ అయింది. ఇప్పుడు బుల్లితెరపై కూడా ఆ పరాజయం కొనసాగింది.

Ponniyin Selvan - టీవీల్లో కూడా అదే రెస్పాన్స్
X

పోన్నియిన్ సెల్వన్  రివ్యూ

మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 2 ఈ ఏడాది ఏప్రిల్ 28న థియేటర్లలోకి రానుంది. గత ఏడాది సెప్టెంబర్ 30న విడుదలైన పార్ట్-1, బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి, భారీ విజయం సాధించింది. దీంతో రెండో భాగం కోసం చాలామంది తమిళ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రం తమిళనాడులో అనూహ్యంగా మంచి వసూళ్లను సాధించినప్పటికీ, హిందీ బెల్ట్, తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబరచలేదు. మంచి స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ, ఆంధ్ర-నైజాంలో సినిమా ఫ్లాప్ అయింది.

ఇప్పుడీ సినిమాను బుల్లితెరపై కూడా తిరస్కరించారు తెలుగు ప్రేక్షకులు. ప్రముఖ తెలుగు ఛానెల్ జెమినీ టీవీలో ఫిబ్రవరి 26, ఆదివారం రోజున పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 ప్రసారమైంది. దీనికి కేవలం 2.17 టీఆర్పీ మాత్రమే వచ్చింది. ఓ పెద్ద సినిమాకు ఇంత తక్కువ రేటింగ్ రావడం నిరాశపరిచింది.

ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రభు, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, జయరామ్ నటిస్తున్నారు. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

First Published:  4 March 2023 8:46 AM GMT
Next Story