Telugu Global
Cinema & Entertainment

Ponniyin Selvan 2 - ఆడియో రిలీజ్ కు అంతా రెడీ

Ponniyin Selvan 2 - పీఎస్2 సినిమా ట్రయిలర్ రిలీజైంది. ఈ ట్రయిలర్ తో పాటు ఆడియోను ఒకేసారి విడుదల చేయబోతున్నారు.

Ponniyin Selvan 2 - ఆడియో రిలీజ్ కు అంతా రెడీ
X

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ఆవిష్క‌రిస్తోన్న విజువ‌ల్ వండ‌ర్ `పొన్నియిన్ సెల్వ‌న్ 2`. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌పై సుభాస్క‌ర‌న్‌, మ‌ణిర‌త్నం భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు.

గ‌తేడాది తమిళ్ లో సెన్సేష‌న‌ల్ హిట్ అయిన హిస్టారిక‌ల్ మూవీ పొన్నియిన్ సెల్వ‌న్ 1కి కొన‌సాగింపుగా పొన్నియిన్ సెల్వ‌న్ 2 తెర‌కెక్కుతోంది. రెండో భాగంపై భారీ అంచనాలున్నాయి. ఏప్రిల్ 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా మూవీగా తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో `పొన్నియిన్ సెల్వ‌న్ 2` విడుద‌ల‌వుతుంది.

ప్రేమ‌, ప‌గ‌, ప్ర‌తీకారం, రాజ‌కీయం, రాజ్యాధికారం, వీర‌త్వం..వంటి అంశాల చుట్టూ తిరిగే ఈ హిస్టారిక‌ల్ మూవీ కోసం కోలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన బి.టి.ఎస్ వీడియో, ఆగ‌నందే పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ మూవీ ట్రైల‌ర్‌, ఆడియో లాంచ్‌ను చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మార్చి 29న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. విక్ర‌మ్, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వ‌ర్యారాయ్‌, త్రిష‌, జ‌య‌రామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా.. ఏప్రిల్ 28న త‌మిళ్‌ తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ అవుతుంది.

First Published:  27 March 2023 2:47 PM GMT
Next Story