Telugu Global
Cinema & Entertainment

పొన్నియన్ సెల్వన్-1 ట్రయిలర్.. ఓ వీరోచిత గాధ

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ట్రయిలర్ ను తాజాగా విడుదల చేశారు.

పొన్నియన్ సెల్వన్-1 ట్రయిలర్.. ఓ వీరోచిత గాధ
X

మణిరత్నం కలల ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా నుంచి తొలి భాగం సిద్ధమైంది. తాజాగా ట్రయిలర్ రిలీజైంది. మణిరత్నం నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో, అవన్నీ ట్రయిలర్ లో ఉన్నాయి. హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ సంయుక్తంగా విడుదల చేసిన ఈ ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం.

వెయ్యి ఏళ్ల క్రితం చోళ నాట స్వర్ణశకం ఉదయించక ముందు, ఓ తొకచుక్క ఆకాశంలో ఆవిర్భవించింది. చోళ రాజ కులంలో ఒకరిని ఆ తోక చుక్క బలిగోరుతోంది అంటూ రానా వాయిస్ ఓవర్ తో గ్రాండ్ గా మొదలైంది పీఎస్-1 ట్రయిలర్. పగలు, ప్రతీకారాలు, రాజద్రోహం లాంటి ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయనే విషయాన్ని ట్రయిలర్ లో చెప్పారు. స్టోరీలైన్ తో పాటు.. సినిమాలో కీలక పాత్రలన్నింటినీ వరుసగా పరిచయం చేశారు.

ట్రయిలర్ లో విక్రమ్, కార్తి, ఐశ్వర్య రాజేష్, త్రిష, జయం రవి పాత్రలు పవర్ ఫుల్ గా ఉన్నాయి. వీళ్ల గెటప్స్, గ్రాఫిక్స్, సెట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ రిచ్ గా ఉన్నాయి. ట్రయిలర్ లో కనిపించిన యుద్ధ సన్నివేశాలు, పోరాటాలు సినిమాపై అంచనాల్ని మరింత పెంచాయి.

ఈనెల 30న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది పొన్నియన్ సెల్వన్-1. సౌత్ భాషలతో పాటు హిందీలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. రవి వర్మన్ సినిమాటోగ్రాఫర్ గా, తోట తరణి ఆర్ట్ డైరక్టర్ గా వర్క్ చేశారు.



First Published:  7 Sep 2022 4:27 AM GMT
Next Story