Telugu Global
Cinema & Entertainment

Polimera 2 | ఓటీటీలో కూడా సూపర్ హిట్

Polimera 2 - థియేటర్లలో ఊహించని విధంగా సక్సెస్ అయిన పొలిమేర-2 సినిమా, ఓటీటీలో కూడా క్లిక్ అయింది.

Polimera 2 | ఓటీటీలో కూడా సూపర్ హిట్
X

థియేటర్లకు వెళ్లే జనాలు, ఓటీటీలో సినిమాలు చూసే వీక్షకుల మధ్య స్పష్టమైన తేడా ఉంది. థియేటర్లలో చూడాలనుకునే సినిమా కంటెంట్ కు, ఓటీటీలో చూడాలనుకునే కథలకు చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పటికే ఆ తేడా బయటపడింది కూడా. అయితే ఒక్క విషయంలో మాత్రం థియేటర్-ఓటీటీ కలుస్తాయి. అదే హిట్ సినిమా.

థియేటర్లలో హిట్టయిన సినిమాకు ఆటోమేటిగ్గా ఓటీటీలో క్రేజ్ వస్తుంది, వ్యూస్ వస్తాయి, వ్యూయింగ్ మినిట్స్ పెరుగుతాయి. అల్టిమేట్ గా హిట్ అవుతుంది. ఇప్పుడు పొలిమేర-2 కూడా అదే కోవలోకి వెళ్లింది.

థియేటర్లలో ఊహించని విజయం సాధించిన ఈ సినిమా, ఓటీటీలో కూడా క్లిక్ అయింది. మినిమం టైమ్ లో ఏకంగా 100 మిలియన్ నిమిషాల వీక్షణలు పొందింది ఈ సినిమా. ఆహా యాప్ లోకి వచ్చిన ప్రతి వీక్షకుడు పొలిమేర-2 సినిమా చూశాడంటే, ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అర్థం చేసుకోవచ్చు.

సత్యం రాజేష్ నటించిన ఈ సంచలనాత్మక చిత్రం ఓటీటీలో ప్రశంసలు అందుకుంటోంది. మంచి మలుపులు, ఉత్కంఠ రేపే కథనంతో సాగిన ఈ సినిమా.. 2023లో హిట్టయిన టాలీవుడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

First Published:  13 Dec 2023 3:12 PM GMT
Next Story