Telugu Global
Cinema & Entertainment

దయచేసి ఇక నా విడాకుల వార్తలు రాయొద్దు.. మీడియాకు చైతూ విజ్ఞప్తి

త‌నకు, సమంతకు కోర్టు విడాకులు ఇచ్చి సంవత్సరం దాటినా ఇంకా కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ ఉండడంపై చైతూ మండిపడ్డారు.

దయచేసి ఇక నా విడాకుల వార్తలు రాయొద్దు.. మీడియాకు చైతూ విజ్ఞప్తి
X

నేను, సమంత విడాకులు తీసుకుని సంవత్సరం దాటినా.. ఇంకా మా విడాకులపై కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాస్తూనే ఉన్నాయని.. దయచేసి ఇకనైనా మా విడాకులపై వార్తలు రాయడం ఆపాలని ప్రముఖ సినీ హీరో నాగచైతన్య మీడియాకు విజ్ఞప్తి చేశాడు. నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత 2018లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఇద్దరూ విడిపోయారు. వీరికి కోర్టు విడాకులు కూడా మంజూరు చేసింది.

అయితే చైతన్య, సమంత విడాకులు తీసుకుని ఏడాది దాటినా.. ఈ విషయానికి సంబంధించిన వార్తలు మాత్రం తరచూ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ వార్తలపై చైతన్య స్పందించారు. ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన చైతూ.. విడాకులు, తనపై వస్తున్న రూమర్ల గురించి మాట్లాడారు.

త‌నకు, సమంతకు కోర్టు విడాకులు ఇచ్చి సంవత్సరం దాటినా ఇంకా కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ ఉండడంపై చైతూ మండిపడ్డారు. తాను నటించే సినిమాల గురించి ఎటువంటి ప్రచారాలు చేసినా.. తనకు ఎటువంటి ఇబ్బంది లేదని.. కానీ తన వ్యక్తిగత జీవితం గురించి పదేపదే మాట్లాడుతుంటే బాధ కలుగుతోందన్నారు. కొన్ని మీడియా సంస్థలు కేవలం హెడ్‌లైన్స్ కోసం తన విడాకుల వార్తలు రాస్తుండటం బాధ కలిగిస్తోందన్నారు.

కొన్ని కారణాల వల్ల సమంతతో తాను విడిపోవాల్సి వచ్చిందని, కానీ తన జీవితంలో ఆ దశ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. కానీ రెండేళ్లుగా మీడియా తన విడాకుల పట్ల రూమర్లు క్రియేట్ చేయడం ఇబ్బంది కలిగిస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఎన్నాళ్లు ఈ వార్తలను సాగదీస్తారో అర్థం కావడం లేదని చైతూ ఆవేదన వ్యక్తం చేశారు.

విడాకుల పేరిట తన గురించి, సమంత గురించి వార్తలు రాస్తున్న వారు ఈ విషయంలోకి మూడో వ్యక్తిని కూడా లాగుతున్నారని చైతూ తెలిపారు. ఇలా తమ మధ్యలోకి మరో వ్యక్తిని లాగడం వల్ల వారి కుటుంబం ఎంత బాధ పడుతుందో అని ఆలోచించడం లేదన్నారు. `నేను, సమంత విడాకుల విషయం గురించి అన్ని విషయాలను వెల్లడించాం.. ఇక నుంచి అయినా మీడియా ఈ విషయం గురించి వదిలేస్తుందని ఆశిస్తున్నా` అని నాగచైతన్య చెప్పారు.

First Published:  9 May 2023 8:44 AM GMT
Next Story