Telugu Global
Cinema & Entertainment

Pizza 3 - డిఫరెంట్ కాన్సెప్ట్ తో పిజ్జా-3, ట్రయిలర్ రిలీజ్

Pizza 3 Trailer - డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది పిజ్జా-3 సినిమా. తాజాగా రిలీజైన ట్రయిలర్ చూస్తే, ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది.

Pizza 3 - డిఫరెంట్ కాన్సెప్ట్ తో పిజ్జా-3, ట్రయిలర్ రిలీజ్
X

మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'పిజ్జా'. ఈ ఫ్రాంచైజీ లో వచ్చిన 2 చిత్రాలు తెలుగు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొని, భారీ విజయాలు సాధించి, ప్రత్యేక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు 'పిజ్జా3' తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇటివలే తమిళంలో విడుదలైన 'పిజ్జా3', అక్కడ మంచి హిట్ సాధించింది. అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రల్లో మోహన్ గోవింద్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పిజ్జా3' కోలీవుడ్ లో సక్సెస్ అయింది. ఈ చిత్రం తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్న కనెక్ట్ మూవీస్ త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.

తాజాగా మేకర్స్ ట్రైలర్ ని విడుదల చేశారు. ‘’అనగనగా ఒక ఊర్లో ఓ రాజు ఉండేవాడు. ఆ రాజు వేటకి వెళ్ళినప్పుడు జింక అని పొరబడి ఒక మనిషిని వేటాడుతాడు. చనిపోయిన ఆ మనిషి తల్లితండ్రులు పుత్ర శోకంతో ఆ రాజుని శపించారు. అప్పటి నుంచి ఆ రాజు అనుభవించిన వేదనే అతి పెద్ద ఇతిహాసంగా మారింది’’ అనే వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చింది.

కథ, కథనం చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాయి. విజువల్స్ హారర్ ని ఎలివేట్ చేస్తూ టెర్రిఫిక్ గా అనిపించాయి. అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ల నటన మరో ఆకర్షణగా నిలిచింది. కెమెరా వర్క్, నేపధ్య సంగీతం బాగున్నాయి. చూస్తంటే.. టాలీవుడ్ లో కూడా ఈ సినిమా క్లిక్ అయ్యేలా ఉంది.

First Published:  12 Aug 2023 3:26 AM GMT
Next Story