Telugu Global
Cinema & Entertainment

Pawan, Prabhas Movies - ఈ 2 సినిమాల గురించి ఇప్పుడు చెప్పడంట

Pawan, Prabhas Movies - పవన్, ప్రభాస్ మూవీస్ పై పీపుల్ మీడియా స్పందించింది. ఇప్పట్లో అప్డేట్స్ ఉండవని స్పష్టం చేసింది.

Pawan, Prabhas Movies - ఈ 2 సినిమాల గురించి ఇప్పుడు చెప్పడంట
X

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంస్థ. మరీ ముఖ్యంగా ఒకేసారి ఇటు ప్రభాస్ తో, అటు పవన్ కల్యాణ్ తో సినిమాలు నిర్మిస్తున్న సంస్థ ఇది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ 2 సినిమాల్ని ఆ సంస్థ చాలా సైలెంట్ గా పూర్తి చేస్తోంది.


ముందుగా ప్రభాస్ సినిమా విషయానికొద్దాం.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. కనీసం ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టారనే విషయం కూడా బయటకు రాలేదు. అంతలోనే రెగ్యులర్ షూట్ మొదలుపెట్టారు. చకచకా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ముగ్గురు హీరోయిన్లను కూడా లాక్ చేశారు. కానీ ఎలాంటి అప్ డేట్ లేదు.


ఇక పవన్ కల్యాణ్ విషయానికొద్దాం.. ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టారనే విషయం మాత్రమే జనాలకు తెలుసు. ఆ తర్వాత సెట్స్ పైకి వచ్చిందనే విషయం తెలుసు. అంతకుమించి ఎలాంటి అప్ డేట్స్ లేవు.


ఈ రెండు సినిమాలపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సహ-నిర్మాత వివేక్ కూచిబొట్ల స్పందించారు. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్న మాట నిజమేనని అంగీకరించిన వివేక్, సరైన సమయం చూసి ఆ రెండు సినిమా వివరాల్ని వెల్లడిస్తామని తెలిపారు.


ప్రభాస్ నుంచి సలార్, ఆదిపురుష్ సినిమాలు రావాల్సి ఉంది. అటు పవన్ కల్యాణ్ నుంచి హరిహర వీరమల్లు సినిమా రావాలి. ఈ సినిమాలు క్లియర్ అయితే తప్ప, తమ సినిమాల అప్ డేట్స్ ఇవ్వకూడదని పీపుల్ మీడియా మేకర్స్ నిర్ణయించారు.

First Published:  17 March 2023 11:49 AM GMT
Next Story