Telugu Global
Cinema & Entertainment

Gopichand | మళ్లీ పీపుల్ మీడియా బ్యానర్ లో గోపీచంద్

Gopichand - గోపీచంద్ సినిమాతో మరోసారి అసోసియేట్ అయింది పీపుల్ మీడియా బ్యానర్. ఇది శ్రీనువైట్ల సినిమా.

Gopichand | మళ్లీ పీపుల్ మీడియా బ్యానర్ లో గోపీచంద్
X

పీపుల్ మీడియా బ్యానర్ లో గోపీచంద్ ఆల్రెడీ ఓ సినిమా చేశాడు. ఇప్పుడు అతడి తాజా చిత్రంలో కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భాగస్వామిగా మారింది. అలా ఈ బ్యానర్ లో గోపీచంద్ మరో సినిమా చేస్తున్నట్టయింది.

గోపీచంద్, శ్రీను వైట్ల కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై వేణు దోనేపూడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పుడీ సినిమాలో పీపుల్ మీడియా కూడా జాయిన్ అయింది.

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి తొలి వెంచర్ ఇది. అత్యున్నత స్థాయి ప్రొడక్షన్ , సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా కోసం చిత్రాలయం స్టూడియోస్‌తో కలిసి పని చేస్తుంది.

ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్‌లో, ప్రధాన తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది.

ఈ సినిమాలో గోపీచంద్‌ని కొత్త అవతార్ లో శ్రీను వైట్ల ప్రెజెంట్ చేస్తున్నారు. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. కెవి గుహన్ డీవోపీగా చేస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

First Published:  28 March 2024 2:42 AM GMT
Next Story