Telugu Global
Cinema & Entertainment

Peddha Kapu 1 Teaser | పెదకాపు టీజర్ ఎలా ఉందంటే..!

Peddha Kapu 1 Movie Teaser | నారప్ప తర్వాత శ్రీకాంత్ అడ్డాల మరోసారి అదే జానర్ టచ్ చేశాడు. పెదకాపు-1 టీజర్ రిలీజైంది.

Peddha Kapu 1 Teaser | పెదకాపు టీజర్ ఎలా ఉందంటే..!
X

Peddha Kapu 1 Teaser | పెదకాపు టీజర్ ఎలా ఉందంటే..!

Peddha Kapu 1 Movie Teaser | శ్రీకాంత్ అడ్డాల మరోసారి మాస్ బాట పట్టాడు. మొదట్లో సాఫ్ట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చేశాడు. ‘నారప్ప’లో అద్భుతమైన టేకింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. నారప్ప తర్వాత ఇప్పుడు మరో రూరల్ యాక్షన్ డ్రామాను సెలక్ట్ చేసుకున్నాడు. అదే పెదకాపు-1. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది.

ద్వారకా క్రియేషన్స్‌ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ’పెద్ద కాపు-1’ టీజర్ గ్రాండ్ గా ఉంది. తన గత సినిమాలకు భిన్నంగా ఇంటెన్స్, పొలిటికల్ ఎలిమెంట్స్ తో ఆశ్చర్యపరిచాడు అడ్డాల. ఆంధ్రుల ఆత్మ గౌరవం గురించి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ చేసిన ప్రముఖ రాజకీయ ప్రసంగంతో టీజర్ ప్రారంభమవుతుంది. ఇద్దరు శక్తివంతమైన వ్యక్తుల ఆధిపత్యం ఉన్న గ్రామంలో ఒక సాధారణ వ్యక్తి పాలనను చేపట్టడం అనేది కథాంశం. ఈ ఇద్దరి మధ్య చావు తప్ప గ్రామస్తులకు వేరే మార్గం లేదు.

అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా ఇది. శ్రీకాంత్ అడ్డాల కథ-కథనంలో తన బ్రిలియన్స్ చూపించాడు. హీరో పాత్ర ఒక సాధారణ వ్యక్తి నుండి రెండు పవర్ ఫుల్ శక్తులకు వ్యతిరేకంగా చేసిన పోరాటం వరకు అద్భుతంగా ఎలా సాగిందనేది ఈ పెదకాపు స్టోరీ. హీరో విరాట్ కర్ణ లుక్స్ బాగున్నాయి. పాత్రకు కావలసిన ఇంటెన్సిటీ అతడిలో ఉంది.

డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. గ్రామ నాయకులుగా రావు రమేష్ , ఆడుకలం నరేన్ పవర్ ఫుల్ గా కనిపించారు. తనికెళ్ల భరణి, నాగబాబు ప్రజన్స్ ఆకట్టుకుంది. టీజర్ చివర్లో శ్రీకాంత్ అడ్డాల కనిపించడం మరో సర్ ప్రైజ్. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఆగస్ట్ 18న థియేటర్లలోకి రాబోతోంది పెదకాపు-1.



First Published:  3 July 2023 11:28 AM GMT
Next Story