Telugu Global
Cinema & Entertainment

Rakshana | నాగార్జున టైటిల్ తో పాయల్ సినిమా

Payal Rajput's Rakshana - గతంలో రక్షణ అనే టైటిల్ తో సినిమా చేశాడు నాగ్. ఇప్పుడు అదే టైటిల్ తో పాయల్ ఓ సినిమా చేస్తోంది.

Rakshana | నాగార్జున టైటిల్ తో పాయల్ సినిమా
X

ఆర్ఎక్స్100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న సినిమా ‘ర‌క్ష‌ణ‌’. రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో పాయ‌ల్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో మెప్పించ‌బోతోంది. ఈ మూవీ శ‌ర‌వేగంగా రూపొందుతోంది.

హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా రూపొందుతోన్న ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్‌.

ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు పాయ‌ల్ రాజ్‌పుత్ చేసిన సినిమాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన సినిమా. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆసాంతం క‌ట్టిప‌డేయ‌నున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీస‌ర్‌గా పాయ‌ల్‌ మెప్పించ‌బోతోంది.

ర‌క్ష‌ణ ఓ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటన స్పూర్తితో రాసిన కథ ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వ‌ర‌లోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.




First Published:  11 May 2024 5:34 PM GMT
Next Story