Telugu Global
Cinema & Entertainment

Ustaad Bhagat Singh | ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అప్ డేట్స్

Ustaad Bhagat Singh - పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ కు డేట్ లాక్ అయింది.

Ustaad Bhagat Singh | ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అప్ డేట్స్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ తొలిసారి కలిసి ఇండస్ట్రీలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటైన ‘గబ్బర్ సింగ్‌’ ను అందించారు. ఈ బ్లాక్‌బస్టర్ కాంబోతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మరో స్పెషల్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయింది. ఆ షెడ్యూల్ లో తీసిన సన్నివేశాలతోనే గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో భారీ షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 5 నుంచి ఇది ప్రారంభం కానుంది.

ఈ భారీ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, అతని టీం హైదరాబాద్ లో భారీ సెట్‌ను నిర్మించారు.

ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఛోటా కె ప్రసాద్‌ ఎడిటర్ గా పని చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సినిమాకు సంబంధించి ఇది రెండో షెడ్యూల్ మాత్రమే.

First Published:  21 Aug 2023 5:04 PM GMT
Next Story