Telugu Global
Cinema & Entertainment

Hungry Cheetah - OG | ఓజీ నుంచి హంగ్రీ చీతా సాంగ్ వచ్చేసింది..!

ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న ఓజీ 'హంగ్రీ చీతా' సాంగ్ నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

Hungry Cheetah - OG | ఓజీ నుంచి హంగ్రీ చీతా సాంగ్ వచ్చేసింది..!
X

ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న ఓజీ 'హంగ్రీ చీతా' సాంగ్ నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో రిలీజ్ అయిన కొన్ని నిమిషాలకే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గంటల్లోనే యూట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ ప్లేస్ కు చేరుకుంది. డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఏ విధంగా అయితే చూడాలని అనుకుంటున్నారో అంతకుమించి ఊర మాస్ గా చూపించడంతో ఫ్యాన్స్ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. నిమిషాలు, గంటల్లోనే ఓజీ గ్లింప్స్ రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది.

ఇక ఈ వీడియోలో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. ఈ మ్యూజిక్ కోసమే అభిమానులు పదే గ్లింప్స్ వీడియోను చూస్తున్నారు. ఇక చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గ్లింప్స్ లో ప్లే చేసిన హంగ్రీ చీతా సాంగ్ ని సెపరేట్ ట్రాక్ గా రిలీజ్ చేయాలని సోనీ మ్యూజిక్ సంస్థను సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశారు. ఫ్యాన్స్ కోరిక మేరకు సోనీ మ్యూజిక్ ఇవాళ ఓజీ గ్లింప్స్ లోని సాంగ్ ట్రాక్ ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ పంజా సినిమా తర్వాత ఓజీలో గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. నిన్న విడుదలైన గ్లింప్స్ లో పవన్ ను సుజిత్ పవర్ ఫుల్ రోల్ లో చూపించడంతో ఈ సినిమాపై అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమా ఇదివరకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాలేదు. ఓజీ మూవీ తొలిసారిగా పలు భాషల్లో విడుదల అవుతోంది. ఓజీ సినిమా ఇంకా రెండు షెడ్యూళ్ల షూటింగ్ జరగాల్సి ఉండగా.. డిసెంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఓజీ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ఈ మూవీని నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రయత్నిస్తోంది.


First Published:  3 Sep 2023 5:10 PM GMT
Next Story