Telugu Global
Cinema & Entertainment

OG Movie - పవన్ సినిమా షూటింగ్ అప్ డేట్స్

Pawan Kalyan OG movie - ప్రస్తుతం ఓజీ సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఈ మూవీ షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం

OG Movie - పవన్ సినిమా షూటింగ్ అప్ డేట్స్
X

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ఓజీ అనే టైటిల్ పెట్టారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ హిందీ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు.

హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించి మూడో షెడ్యూల్ పూర్తయింది. దీంతో 50 శాతం షూటింగ్ పూర్తయినట్టు యూనిట్ ప్రకటించింది. "ఓజీ చిత్రీకరణ 50 శాతం పూర్తయింది. రాబోయే షెడ్యూల్స్ మరింత ఆసక్తికరంగా ఉండనున్నాయి" అంటూ ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈరోజు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

దర్శకుడు సుజీత్, ఈ సినిమాను పక్కా ప్లానింగ్, షెడ్యూల్స్ తో పూర్తిచేస్తున్నాడు. జూలై, ఆగస్ట్‌ లో జరగనున్న షెడ్యూల్స్‌తో, మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయబోతున్నాడు. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ పట్ల టీమ్ చాలా సంతోషంగా ఉంది. ఇటీవల ఓజీ రష్‌ చూసిన అర్జున్ దాస్.. అందులో విజువల్స్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఫిదా అయ్యాడు. అలాగే శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ ఇద్దరూ తాము ఓజీ కథని ఎంతలా ఇష్టపడ్డారో బయటపెట్టారు.

ఈ చిత్రానికి రవి కె చంద్రన్ ఫోటోగ్రాఫర్ గా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఓజీని రిలీజ్ చేయబోతున్నారు.

First Published:  26 Jun 2023 1:02 PM GMT
Next Story