Telugu Global
Cinema & Entertainment

OG Movie - పవన్ ఓజీ మూవీ షూటింగ్ అప్ డేట్స్

Pawan Kalyan - ఓజీ మూవీకి మరోసారి కాల్షీట్లు కేటాయించాడు పవన్. ఈరోజు ఈ సినిమా మూడో షెడ్యూల్ మొదలైంది.

OG Movie - పవన్ ఓజీ మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలైంది.

ఓజీ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో మూడో షెడ్యూల్ ఇవాళ్టి నుంచి స్టార్ట్ అయింది. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులపై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. త్వరలోనే పవన్ కల్యాణ్ ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతాడు.

ఓజీకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ను ముంబయి, పూణెలో నిర్వహించారు. సెకెండ్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తిచేశారు. ఇప్పుడు మూడో షెడ్యూల్ కూడా మొదలైంది. ప్రతి షెడ్యూల్ కు పవన్ కల్యాణ్ కాల్షీట్లు కేటాయించడం విశేషం.

సాహో తర్వాత సుజీత్ డైరక్ట్ చేస్తున్న సినిమా ఇదే. ఈ స్టోరీ బాగా నచ్చి, స్వయంగా త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కు సిఫార్స్ చేయడంతో సినిమా పట్టాలపైకి వచ్చింది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  4 Jun 2023 2:59 PM GMT
Next Story