Telugu Global
Cinema & Entertainment

OG Movie | ఓజీ మూవీ గ్లింప్స్ ఎలా ఉందంటే..?

OG Movie - పవన్ కల్యాణ్ ఓజీ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ అయింది. ఎలా ఉందో చూద్దాం..

OG Movie | ఓజీ మూవీ గ్లింప్స్ ఎలా ఉందంటే..?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'ఓజీ'. ఈ సినిమాకు సుజీత్ దర్శకుడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్‌ వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్. ప్రముఖ హిందీ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఈ చిత్రం నుండి ఈ రోజు అదిరిపోయే గ్లింప్స్ ని విడుదల చేశారు. దర్శకుడు సుజీత్, తమన్, నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కళ్యాణ్ దాసరి అభిమానులతో కలిసి గ్లింప్స్ ని వీక్షించారు. పెద్ద తెరపై తమ అభిమాన హీరోని చూడటం కోసం అభిమానులు తరలిరావడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

అర్జున్ దాస్ వాయిస్‌ఓవర్‌తో పవన్ కళ్యాణ్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ప్రారంభమవుతుంది ఓజీ గ్లింప్స్. “పదేళ్ల క్రితం బొంబాయిలో వచ్చిన తుఫాను గుర్తుందా?. అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరిని ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. అదొక భయంకరమైన రక్తపు స్నానం. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే.. అతను సైతాను అవుతాడు" అంటూ ఒక్క డైలాగ్ తో పవన్ కళ్యాణ్ పాత్ర ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పారు.

ఈ 99 సెకన్ల గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని మరింత పెంచేసింది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ నెలలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ చిత్రానికి రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నాడు.

First Published:  2 Sep 2023 3:22 PM GMT
Next Story