Telugu Global
Cinema & Entertainment

Bro Movie - పవన్ సినిమాకు టైటిల్ ఫిక్స్

Pawan Kalyan - సాయిధరమ్ తేజ్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఈ సినిమాకు బ్రో అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

Bro Movie - పవన్ సినిమాకు టైటిల్ ఫిక్స్
X

'PKSDT' టైటిల్, ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ సినిమాకి 'BRO' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. కాలాన్ని సూచించేలా ఇంగ్లీష్ అక్షరాలతో ఎంతో అందంగా రూపొందించిన టైటిల్ లోగో ఆకట్టుకుంటోంది. ఇక ఈ 'బ్రో' మూవీ మోషన్ పోస్టర్ అయితే కట్టిపడేస్తుంది.

బ్యాక్ గ్రౌండ్ లో పరమేశ్వరుడి రూపం కనిపిస్తుండగా.. "కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం.. అనే శ్లోకం వినిపిస్తుండగా.. మెడలో ఓం లాకెట్ ధరించి స్టైలిష్ గాడ్ లా కనిపిస్తున్న హీరో పవన్ కళ్యాణ్ ను మోషన్ పోస్టర్ లో చూపించారు. కళ్యాణ చక్రవర్తి ఈ పాట రాశారు. అలాగే ఈ చిత్రాన్ని 2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

'బ్రో' ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం పట్ల సాయి ధరమ్ తేజ్ తన ఆనందాన్ని పంచుకున్నారు. నా గురువు అయిన పవన్ కళ్యాణ్ మామతో కలిసి పనిచేయడం నా అతిపెద్ద కల అని, ఆ కల నెరవేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇంతటి అదృష్టం దక్కినందుకు ఓ అభిమానిగా మనసులోనే డాన్స్ చేస్తున్నానని అన్నాడు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతోంది బ్రో. సముద్రఖని ఈ సినిమాకు దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చారు. తమిళ్ లో వచ్చిన వినోదాయశితం అనే సినిమాకు రీమేక్ ఇది.



First Published:  18 May 2023 4:03 PM GMT
Next Story