Telugu Global
Cinema & Entertainment

Harihara Veeramallu: పవన్ సినిమా టీజర్ వచ్చేస్తోంది?

Harihara Veeramallu: పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఇప్పుడీ సినిమా నుంచి టీజర్ రాబోతోంది.

Harihara Veeramallu: పవన్ సినిమా టీజర్ వచ్చేస్తోంది?
X

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పవన్ కెరీర్ లోనే తొలి పీరియాడిక్ ఫిక్షన్ మూవీ ఇది. మెగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా, మరో 2 నెలల్లో కొలిక్కి రాబోతోంది.

ఈ గ్యాప్ లో సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే మూవీ నుంచి గ్లింప్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ ను రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల్లోనే, రిపబ్లిక్ డే కానుకగా 26వ తేదీన హరిహర వీరమల్లు సినిమా టీజర్ వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇందులో పవన్ ఓ దొంగగా కనిపించబోతున్నాడు. ఔరంగజేబు పాత్రలో బాబి డియోల్ నటిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్.

సినిమాను మార్చి 30న విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. అదే తేదీకి కట్టుబడి ఉంటారా లేక మరో విడుదలను వాయిదా వేస్తారా అనేది ఈ నెలాఖరుకు తేలిపోతుంది. విడుదల తేదీపై స్పష్టమైన ప్రకటన టీజర్ తో వచ్చే అవకాశం ఉంది.

First Published:  2 Jan 2023 4:30 AM GMT
Next Story