Telugu Global
Cinema & Entertainment

BRO Movie - బ్రో మూవీ టైటిల్ సాంగ్ రిలీజ్

Pawan Kalyan's BRO - పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా బ్రో. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది.

BRO Movie - బ్రో మూవీ టైటిల్ సాంగ్ రిలీజ్
X

పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా 'బ్రో'. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, ప్రోమోలు, టీజర్‌కు అద్భుతమైన స్పందన రాగా, ఈరోజు 'బ్రో' నుండి మొదటి సింగిల్ విడుదలైంది.

తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లపై తెరకెక్కించిన 'మై డియర్ మార్కండేయ' పాటను రేవంత్, స్నిగ్ధ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు గణేష్ స్వామి, భాను కొరియోగ్రఫీ అందించారు. ఈ సాంగ్ కోసం భారీ పబ్ సెట్ వేశారు. లిరికల్ వీడియో లో ఆ సెట్ కూడా చూడొచ్చు. ఈ పాటలో ఊర్వశి రౌతేలా తన అందం, నాట్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ పబ్ సాంగ్ లో కూడా మంచి సందేశం ఇచ్చారు. ప్రతిరోజూ ఓ పండుగలా ఎలా జీవించాలి అనే విలువైన సందేశాన్ని ఇచ్చారు లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి.. దుస్తులు దగ్గర నుంచి ఛాయాగ్రహణం, నృత్యం, సంగీతం ఇలా 'మై డియర్ మార్కండేయ' పాటకు అన్నీ చక్కగా కుదిరాయి.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ ఈ సినిమాలో దేవుడిగా కనిపించబోతున్నాడు.



First Published:  8 July 2023 2:21 PM GMT
Next Story