Telugu Global
Cinema & Entertainment

BRO Movie - బ్రో సినిమా డబ్బింగ్ వర్క్ ప్రారంభం

BRO Movie - పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా బ్రో. తాజాగా ఈ మూవీ డబ్బింగ్ పనులు మొదలయ్యాయి

BRO Movie - బ్రో సినిమా డబ్బింగ్ వర్క్ ప్రారంభం
X

బ్రో సినిమా నుంచి ఇదివరకే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సోలో ఫస్ట్-లుక్ పోస్టర్‌లు రిలీజ్ అయ్యాయి. వీటి తర్వాత మెగా అభిమానులను థ్రిల్ చేసిన కాంబినేషన్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ ఫాంటసీ మూవీపై భారీ అంచనాలున్నాయి. తమిళ చిత్రం వినోదయ శితం రీమేక్ ఇది.

ఇప్పుడీ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా డబ్బింగ్ పనులను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. 28 జూలైన థియేటర్లలోకి రానుంది బ్రో మూవీ. ఈ సినిమాకు త్రివిక్రమ్, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే రాస్తున్న సంగతి తెలిసిందే.

జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో.. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బ్రహ్మానందం, రోహిణి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం పవన్ చేతిలో చాలా సినిమాలున్నాయి. కానీ భీమ్లానాయక్ తర్వాత ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అలా పవన్ నుంచి ముందుగా వస్తున్న సినిమా బ్రో.




First Published:  31 May 2023 3:40 AM GMT
Next Story