Telugu Global
Cinema & Entertainment

పవన్ సినిమా హిందీ రిలీజ్ లేనట్టే!

పవన్ హీరోగా నటించిన సినిమా భీమ్లానాయక్. ఈ సినిమాను హిందీలో సెట్ మ్యాక్స్ టీవీలో ప్రసారం చేయబోతున్నారు. సో.. ఈ సినిమా హిందీ థియేట్రికల్ రిలీజ్ ఇక లేనట్టే.

పవన్ సినిమా హిందీ రిలీజ్ లేనట్టే!
X

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్టయింది. అయితే ఈ సినిమాను ఆ టైమ్ లో హిందీలో రిలీజ్ చేయలేకపోయారు. రీమేక్ రైట్స్ తీసుకున్నప్పుడు ఏర్పడిన వివాదాలు, హిందీ మార్కెట్ రేట్లు అందుబాటులో లేని కారణంగా రిలీజ్ అవ్వలేదు. ఆ తర్వాత నిర్మాతలు చాలా ప్రయత్నించినప్పటికీ, హిందీ మార్కెట్లోకి ఈ సినిమా రాలేదు.

అలా నార్త్ బెల్ట్ కు దూరమైన ఈ సినిమా, ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకుల కోసం ముస్తాబవుతోంది. అయితే ఈసారి థియేటర్లలోకి రావడం లేదు. భీమ్లానాయక్ హిందీ డబ్బింగ్ రైట్స్ ను సెట్ మ్యాక్స్ ఛానెల్ దక్కించుకుంది. ఆ ఛానెల్ లో ఈ సినిమాను ఎక్స్ క్లూజివ్ గా ప్రసారం చేయబోతున్నారు.

ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహించినప్పటికీ, స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్, అన్నీ తానై వ్యవహరించాడు. మూల కథకు మార్పుచేర్పులు చేయడంతో పాటు.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా సమకూర్చి పెట్టాడు. పవన్ కల్యాణ్ ఇమేజ్ కు తోడు, త్రివిక్రమ్ టచ్ కూడా యాడ్ అవ్వడంతో, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

First Published:  15 Oct 2022 1:20 PM GMT
Next Story