Telugu Global
Cinema & Entertainment

మరో రీమేక్ లో పవన్ కల్యాణ్

మరో 3 రోజుల్లో పవన్ కల్యాణ్ ను కలవబోతున్నాడు హరీశ్ శంకర్. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా లాక్ అయింది కానీ, కథ మాత్రం ఫిక్స్ అవ్వలేదు.

మరో రీమేక్ లో పవన్ కల్యాణ్
X

పవన్ కల్యాణ్ కు రీమేక్స్ కొత్త కాదు. ఇంతకుముందు ఎన్నో రీమేక్స్ చేశాడు. ప్రస్తుతం సెట్స్ పై కూడా ఓ రీమేక్ ఉంది. ఇప్పుడు వీటికి తోడుగా మరో రీమేక్ చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు దర్శకుడు హరీశ్ శంకర్ ఏర్పాట్లు చేస్తున్నాడు.

మరో 3 రోజుల్లో పవన్ ను కలవనున్నాడు హరీశ్. ఈ మేరకు పవన్, హరీష్ కు టైమ్ ఇచ్చాడు. ఆ టైమ్ లో తమిళ సినిమా తేరి రీమేక్ ను చర్చించనున్నాడు హరీశ్. విజయ్ హీరోగా నటించిన తేరి సినిమాకు తనదైన మార్పులు చేశాడు హరీశ్. ఈ మార్పుచేర్పులు నచ్చితే, పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే.

ఇంతకుముందు కూడా పవన్ తో రీమేక్ సినిమానే చేశాడు హరీశ్. దబాంగ్ సినిమాను తెలుగులో గబ్బర్ సింగ్ పేరిట తీశాడు. ఇప్పుడు తేరి రీమేక్ పై పవన్-హరీశ్ వర్క్ చేసే ఛాన్స్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది.

నిజానికి పవన్ కోసం భవదీయుడు భగత్ సింగ్ అనే ప్రాజెక్టు అనుకున్నాడు హరీశ్. పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. కానీ ఆ స్టోరీ అనుకున్న విధంగా రాలేదు. హరీశ్ చెప్పిన స్టోరీ పవన్ కు నచ్చలేదు. దీంతో మరోసారి ఇద్దరూ కలిసి రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు.

First Published:  6 Oct 2022 4:24 AM GMT
Next Story