Telugu Global
Cinema & Entertainment

Pawan Kalyan, Sujith Movie OG Launch - పవన్ కొత్త సినిమా లాంఛింగ్

Pawan Kalyan, Sujith Movie OG Launch - సుజీత్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు పవన్. ఈ మూవీకి ఓజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

Pawan Kalyan, Sujith Movie OG Launch - పవన్ కొత్త సినిమా లాంఛింగ్
X

పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబోలో ఓజీ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 2022 లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొంది, ప్రతిష్టాత్మక ఆస్కార్స్ కి సైతం నామినేట్ అయిన 'ఆర్ఆర్ఆర్' వంటి సంచలన విజయం తర్వాత డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రమిది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది.

పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ తో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏఎం రత్నం, దిల్ రాజు, డా. కె యల్. నారాయణ, కెఎల్ దామోదర ప్రసాద్, బీవీఎస్ఎన్ ప్రసాద్.. ముఖ్య అతిథులుగా హాజరై యూనిట్ కు శుభాకాంక్షలు అందించారు.

ముహూర్తపు షాట్ కి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అల్లు అరవింద్, దిల్ రాజు చేతుల మీదుగా చిత్ర దర్శక,నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు.

'రన్ రాజా రన్', 'సాహో' చిత్రాలతో ప్రతిభగల దర్శకుడిగా సుజీత్ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాను అందించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు రవి కె చంద్రన్ కెమెరా బాధ్యతలు చూడనుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ గా వ్యవహరించనున్నాడు. తమన్ సంగీత దర్శకుడు.






First Published:  30 Jan 2023 4:54 PM GMT
Next Story