Telugu Global
Cinema & Entertainment

Pawan Kalyan - హరిహరను పక్కనపెట్టిన పవన్ కల్యాణ్

Pawan Kalyan - హరిహర వీరమల్లు షూట్ లో ప్రత్యక్షం కావాల్సిన పవన్ కల్యాణ్, మరో సినిమా సెట్స్ లో కనిపించాడు.

Pawan Kalyan - హరిహరను పక్కనపెట్టిన పవన్ కల్యాణ్
X

పవన్ కల్యాణ్ సినిమాల ఆర్డర్ మళ్లీ మారింది. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాను ఆయన కొన్నాళ్లు పక్కనపెట్టారు. దాని బదులు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఓ రీమేక్ సినిమాకు కాల్షీట్లు ఇచ్చాడు. సముత్తరఖని దర్శకత్వంలో పవన్ హీరోగా ఈ సినిమా తాజాగా సెట్స్ పైకి వచ్చింది.

తమిళ్ లో ఆదరణ పొందిన వినోదాయ శితం సినిమాకు రీమేక్ గా వస్తోంది ఈ సినిమా. తెలుగులో ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. తమిళ వెర్షన్ ను డైరక్ట్ చేసిన సముత్తరఖనికే, తెలుగు రీమేక్ బాధ్యతలు కూడా అప్పగించారు. కాకపోతే కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్ మాత్రం పూర్తిగా మార్చేశారు.

తెలుగు రీమేక్ కు త్రివిక్రమ్, పూర్తిస్థాయిలో మార్పుచేర్పులు చేశాడు. అలా డైలాగ్స్ తో సహా, స్క్రీన్ ప్లే ఇచ్చి పవన్-సముత్తరఖనిని సెట్స్ పైకి పంపించాడు.

నిజానికి ఇది పవన్ కల్యాణ్ సినిమా కాదు. ఇందులో సాయిధరమ్ తేజ్ హీరో. పవన్ కల్యాణ్ ది గెస్ట్ రోల్ కంటే కాస్త పెద్ద పాత్ర అన్నమాట. ఈ సినిమా కోసం 20 రోజుల కాల్షీట్లు కేటాయించాడు పవన్.






First Published:  23 Feb 2023 3:45 AM GMT
Next Story