Telugu Global
Cinema & Entertainment

Pawan Kalyan - ఆ ప్రాజెక్టులో ఎలాంటి నిజం లేదు

Pawan Kalyan - లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ సినిమా చేయబోతున్నాడట. ఇందులో నిజం ఎంత?

Pawan Kalyan - ఆ ప్రాజెక్టులో ఎలాంటి నిజం లేదు
X

లోకేష్ కనగరాజ్.. సౌత్ సెన్సేషనల్ డైరక్టర్లలో ఒకడు. తెలుగులో నేరుగా సినిమాలు తీయకపోయినా, ఇతడు తీసిన మూవీస్ అన్నీ తెలుగులో కూడా పాపులర్ అయ్యాయి. లోకేష్ కు టాలీవుడ్ లో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ జనరేట్ అయింది. ఇప్పుడీ దర్శకుడు, టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడట. ఏకంగా పవన్ కల్యాణ్ ను డైరక్ట్ చేయబోతున్నాడట

గడిచిన 24 గంటలుగా ఈ పుకారు నడుస్తోంది. దీనిపై ఆరాలు కూడా ఎక్కువయ్యాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు. లోకేష్ తో ఎలాంటి సినిమా ప్రతిపాదన లేదని పవన్ కల్యాణ్ తో టచ్ ఉండే కొంతమంది నిర్థారించారు. అది పూర్తిగా రూమర్ మాత్రమేనని తేల్చారు.

పవన్ కల్యాణ్ చాలా బిజీగా ఉన్నాడు. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇవి పూర్తయితే మరో 2 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చే ప్లాన్ లో కూడా ఉన్నాడు. ఇలాంటి టైమ్ లో లోకేష్ తో సినిమా చేసే వెసులుబాటు పవన్ కు లేదు.

అటు లోకేష్ కూడా బిజీగా ఉన్నాడు. త్వరలోనే రజనీకాంత్ ను సైతం డైరక్ట్ చేయబోతున్నాడు ఈ హీరో. దీంతో పవన్-లోకేష్ కాంబోలో సినిమా పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తేలింది.

First Published:  27 May 2023 10:47 AM GMT
Next Story