Telugu Global
Cinema & Entertainment

ఈరోజు పవన్ కల్యాణ్ రావడం లేదు

గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈరోజు సాయంత్రం గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకకు పవన్ కల్యాణ్ హాజరుకావడం లేదు.

ఈరోజు పవన్ కల్యాణ్ రావడం లేదు
X

ఈరోజు గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకకు పవన్ కల్యాణ్ ప్రత్యేక అతిథిగా వస్తాడనే ప్రచారం వారం రోజులుగా జరిగింది. కానీ ఈరోజు సాయంత్రం జరగనున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ హాజరవ్వడం లేదు. ఆ మాటకొస్తే, ప్రత్యేక అతిథులు లేకుండానే ఫంక్షన్ జరగబోతోంది.

అనంతపురంలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఈరోజు సాయంత్రం గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. ఈ వేడుకకు చిరంజీవి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. ఇక తమన్ తో ప్రత్యేక సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మరో ప్రత్యేకత కూడా ఉంది. గాడ్ ఫాదర్ ట్రయిలర్ ను ఇదే వేదికపైనుంచి గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. టీజర్ ఇప్పటికే హిట్టవ్వడంతో, ట్రయిలర్ పై భారీగా అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా గాడ్ ఫాదర్ ట్రయిలర్ ను సిద్ధం చేశారు.

గాడ్ ఫాదర్ సినిమాలో ఐటెంసాంగ్ కూడా ఉంది. ఆ ఐటెంసాంగ్ క్లిప్పింగ్స్ ను కూడా ట్రయిలర్ లో చూపించబోతున్నారు. చిరంజీవి, నయన్, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ పాత్రలతో పాటు.. ఇతర ముఖ్యపాత్రల్ని గాడ్ ఫాదర్ ట్రయిలర్ లో చూపిస్తారు. దీంతో పాటు స్టోరీపై చిన్నపాటి క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారు.

లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది గాడ్ ఫాదర్. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది.

First Published:  28 Sep 2022 4:07 AM GMT
Next Story