Telugu Global
Cinema & Entertainment

వైజాగ్ లో పవన్ ఫ్యాన్స్ వీరంగం

పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించడం, ఆ తర్వాత పవన్ కల్యాణ్ మాట పడడం కొత్తేం కాదు. తాజాగా మరోసారి ఇదే సీన్ రిపీట్ అయింది. పవన్ పుట్టినరోజు వేడుకల పేరిట విశాఖపట్నంలోని ఓ సినిమా హాల్ ను ఫ్యాన్స్ ధ్వంసం చేశారు

వైజాగ్ లో పవన్ ఫ్యాన్స్ వీరంగం
X

నిన్న పవన్ కల్యాణ్ అభిమానులు, అతడి పుట్టినరోజు ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వేలాది కేకులు కట్ చేశారు. ఎన్నో రక్తదాన శిబిరాలు, అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లపై తీసిన ర్యాలీలు వీటికి అదనం. వీటితో పాటు మరో కార్యక్రమం కూడా నిన్న ఘనంగా జరిగింది. అదే పవన్ కల్యాణ్ పాత హిట్ సినిమాల ప్రదర్శన. సరిగ్గా ఇక్కడే ఫ్యాన్స్ అదుపు తప్పారు.

ఇంతవరకు చెప్పుకున్న కార్యక్రమాలన్నీ సజావుగా జరిగాయి. ఒక్క సినిమా ప్రదర్శన తప్ప. పవన్ పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు, ఖుషి, జల్సా సినిమాల్ని తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ధియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. సదరు థియేటర్లన్నీ హౌజ్ ఫుల్స్ అయ్యాయి. అదే సమయంలో ధ్వంసమయ్యాయి కూడా.

వైజాగ్ లీలా మహల్ లో పవన్ సినిమా కోసం అభిమానులు భారీగా వచ్చారు. సినిమాను ఆసాంతం ఎంజాయ్ చేశారు. అదే టైమ్ లో థియేటర్లలో బీర్లు తాగి వీరంగం సృష్టించారు. బీర్ బాటిల్స్ పగలగొట్టి, వాటితో తెర చించారు. పదుల సంఖ్యలో సీట్లను నాశనం చేశారు.

దీంతో థియేటర్ యాజమాన్యం లబోదిబోమంటోంది. ఓ ఛారిటీ కోసం సినిమా వేస్తే ఇలా ధ్వంసం చేయడం ఏమాత్రం సరికాదంటోంది యాజమాన్యం. పవన్ ఎంత ఆదర్శంగా ఉంటున్నప్పటికీ, ఫ్యాన్స్ చేస్తున్న ఇలాంటి పనుల వల్ల పవన్ కు చెడ్డపేరు తప్పడం లేదని అంటున్నారు.

First Published:  3 Sep 2022 8:00 AM GMT
Next Story