Telugu Global
Cinema & Entertainment

Telugu Movie Shooting Updates: టాలీవుడ్ సినిమాల షూటింగ్ అప్ డేట్స్

Telugu Movie Shooting Updates: పవన్, బాలయ్య, రామ్ చరణ్ సినిమాల అప్ డేట్స్ చూద్దాం..

Telugu Movie Shooting Updates: టాలీవుడ్ సినిమాల షూటింగ్ అప్ డేట్స్
X

వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ హీరో సొంత బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో నడుస్తోంది. నితిన్ పై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత అన్నపూర్ణ స్టుడియోస్ కు షిఫ్ట్ అవుతారు. అక్కడ ఓ సాంగ్ తీస్తారు.

బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. కాజల్ కూడా సెట్స్ పైకి రావడంతో షూటింగ్ ఊపందుకుంది. ప్రస్తుతం బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ కాంబినేషన్ లో సీన్స్ తీస్తున్నారు. అనీల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

వినోదాయశితం రీమేక్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించి పవన్ టాకీ పార్ట్ ఇవాళ్టితో పూర్తయింది. పవన్ పై ఓ పాట షూటింగ్ మాత్రం పెండింగ్ ఉంది. అది కూడా పూర్తయితే పవన్ పార్ట్ కంప్లీట్ అయినట్టే.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం శంషాబాద్ దగ్గర్లో వేసిన సెట్ లో ఈ మూవీ షూట్ నడుస్తోంది. ఈ సినిమా కోసం శంషాబాద్ లో భారీ స్టేడియం సెట్ వేశారు. కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి సెకెండ్ హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  26 March 2023 7:03 AM GMT
Next Story