Telugu Global
Cinema & Entertainment

Pawan Kalyan: బాలయ్యకు డేట్స్ ఇచ్చిన పవన్ కల్యాణ్

Pawan-Balayya: బాలయ్య చేస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పవన్ పాల్గొనబోతున్నాడు. ఈ మేరకు డేట్స్ కూడా ఇచ్చాడు.

Pawan Kalyan: బాలయ్యకు డేట్స్ ఇచ్చిన పవన్ కల్యాణ్
X

బాలయ్యకు పవన్ కల్యాణ్ డేట్స్ ఇవ్వడం ఏంటి? ఇదేదో సినిమా కోసం ఇచ్చే డేట్స్ కాదు. బాలయ్య చేస్తున్న అన్-స్టాపబుల్ షో కోసం ఇచ్చిన డేట్స్. ఆహా వేదికగా అన్ స్టాపబుల్ అనే కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సీజన్-2 చేస్తున్నాడు బాలయ్య. ఈ కార్యక్రమంలో బాలయ్యతో కలిసి చర్చాగోష్ఠిలో పాల్గొనేందుకు పవన్ అంగీకరించాడు.

ఈ ఇంటర్వ్యూ షూటింగ్ ను 27వ తేదీన పెట్టుకోవాల్సిందిగా సమాచారం అందించాడు. దీంతో ఆ దిశగా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. అటు బాలయ్య కూడా 27వ తేదీన తన కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పవన్ తో పాటు దర్శకుడు క్రిష్ కూడా పాల్గొంటున్నాడు. అయితే ఆరోజున త్రివిక్రమ్ కూడా కాసేపు సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ భౌతికంగా సెట్స్ పైకి వస్తాడా లేక వీడియో కాల్ లో త్రివిక్రమ్ ను తీసుకుంటారా అనేది ఇంకా తేలలేదు.

ప్రస్తుతానికి బాలయ్య, పవన్, క్రిష్ డేట్స్ మాత్రం లాక్ అయ్యాయి. త్రివిక్రమ్ మరో 2-3 రోజుల్లో తన షెడ్యూల్స్ చెబుతానని అన్నారు. త్రివిక్రమ్ కూడా వస్తే, ఈ షో నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే, పవన్-త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే.

First Published:  19 Dec 2022 8:30 AM GMT
Next Story