Telugu Global
Cinema & Entertainment

సూపర్ హిట్ సినిమాకు మరో సీక్వెల్

వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం పార్ట్-1, పార్ట్-2 హిట్టయ్యాయి. ఇప్పుడీ సినిమాకు పార్ట్-3 కూడా వస్తోంది.

సూపర్ హిట్ సినిమాకు మరో సీక్వెల్
X

వరుసపెట్టి సీక్వెల్స్ రావడం ఇన్నాళ్లూ బాలీవుడ్ లోనే చూశాం. మూడో భాగం వరకు వచ్చిన సౌత్ సినిమాలు ఇప్పటివరకు లేవు. ఇప్పుడీ ట్రెండ్ ను దృశ్యం సినిమా స్టార్ట్ చేయబోతోంది. అవును.. సూపర్ హిట్టయిన దృశ్యంకు పార్ట్-3 కూడా వస్తోంది.

అన్ని భాష‌ల్లోనూ సూప‌ర్ హిట్ అయిన మూవీ దృశ్యం. మోహ‌న్ లాల్ హీరోగా న‌టించిన ఈ సినిమా బెస్ట్ స్క్రీన్ ప్లేకి ప‌ర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్. తెలుగులో ఈ చిత్రంలో వెంక‌టేశ్‌, మీనా, నదియా, న‌రేశ్ త‌దిత‌రులు న‌టించిన సంగతి తెలిసిందే.

ఇటీవ‌ల వ‌చ్చిన దృశ్యం రెండో భాగం కూడా ప్రేక్షకుల్ని మెప్పించింది. మలయాళం, తెలుగులో మరోసారి హిట్టయింది. తాజాగా ఈ చిత్రం మూడో పార్ట్ కోసం రెడీ అవుతున్నారు మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్‌. దృశ్యం 3 లోడింగ్ అంటూ ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ అప్‌డేట్ ఇచ్చారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో ఒక టేబుల్ ముందు కూర్చుని తీక్షణంగా చూస్తున్నారు మోహన్ లాల్. ఆయన చేతికి బేడీలున్నాయి. దాన్నిబట్టి అది ఇంటరాగేషన్ సీన్ అని అర్థమవుతోంది. ఇలా దృశ్యం-3 అప్ డేట్ ను పోస్టర్ తో సహా వెల్లడించారు మేకర్స్.

తన తెలివితేటలతో హీరో, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనేది 2 భాగాల్లో చూపించాడు దర్శకుడు. మరి మూడో పార్ట్‌‌లో ఏం చేయబోతున్నారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.





First Published:  14 Aug 2022 12:41 PM GMT
Next Story